News March 24, 2025

MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News March 26, 2025

మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

image

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.

News March 26, 2025

ధర్మారం: మద్యానికి బానిసై యువకుడి సూసైడ్

image

మద్యానికి బానిసై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన నవీన్ (29) మద్యానికి బాగా బానిసయ్యాడు. దీంతో అతడి భార్య తనను వదిలివెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News March 26, 2025

వేసవిలో చర్మం రంగు మారుతుందా?

image

వేసవిలో ఎండకు చర్మం రంగు నల్లగా మారుతుంది. UV కిరణాలకు గురికావడం టానింగ్‌కు కారణమవుతుంది. దీనిని నివారించేందుకు ఫుల్ స్లీవ్ గ్లౌజులు ధరించడం ఉత్తమం. కలబంద జెల్‌ను ముఖం, చేతులు, మెడపై అప్లై చేయడం ప్రయోజనకరం. వీటితో పాటు చర్మాన్ని బట్టి ఇంట్లో ఉండే శనగపిండి, పసుపు, పాలు, తేనె, రోజ్ వాటర్‌, ముల్తాన్ మట్టితో ఫేస్‌ప్యాక్ చేసుకొని ముఖం, చేతులు, మెడకు అప్లై చేసుకోవచ్చు.

error: Content is protected !!