News June 10, 2024

MBNR: వాహనదారులకు DGP సూచనలు

image

వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.

Similar News

News April 25, 2025

మరో 3 రోజుల్లో పాలమూరు యూనివర్సిటీ పరీక్షలు 

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 5 బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా మరో 3 రోజులే మిగిలి ఉంది. వివరాలకు www.palamuruuniversity.com వెబ్‌సైట్ చూడండి. ఇక ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం PU పరిధిలోని MBNR, GDWL, NGKL, WNP, NRPTలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. SHARE IT

News April 25, 2025

గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.

News April 25, 2025

వనపర్తి: విషపూరిత ద్రవం తాగి చిన్నారి మృతి

image

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రి దంపతులకు ఆర్థిక(18 నెలలు), మణికంఠ పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి మృతిచెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ద్రవం ఏంటో తెలియరాలేదు.

error: Content is protected !!