News June 22, 2024

MBNR: సీనియార్టీ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల

image

స్కూల్ అసిస్టెంట్ సమానస్థాయి ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 9,824 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్టీజోన్-2లో శుక్రవారం స్కూల్ అసిస్టెంట్ బదిలీల కోసం తాత్కాలిక సీనియార్టీ జాబితాలను విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించి శనివారం ఉదయం వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి కాగానే ఆన్లైన్‌లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

Similar News

News January 3, 2025

నల్లమల విద్యార్థికి బంగారు పతకం 

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. 

News January 2, 2025

బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ 

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కృష్ణ మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కృష్ణ మనోహర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినట్లు నరేందర్ గౌడ్ వెల్లడించారు.

News January 2, 2025

అమరచింత: నిలిచిన జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు గురువారం ఇన్ఫ్లోనిలిచిపోయింది. దీనితో వచ్చే జూన్ వరకు వర్షాలు లేకపోవడంతో తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 4.091 టీఎంసీలు, ఆవిరి ద్వారా 29 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500, మొత్తం అవుట్ స్లో 342 క్యూసెక్కులు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ వెంకటేశ్వరరావు వివరించారు.