News April 28, 2024
MBNR: సూపర్‌హీరోకు CM రేవంత్ రెడ్డి సన్మానం
సూపర్‌హీరో సాయిచరణ్ సాహసం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షాద్‌నగర్ పరిధి నందిగామలోని ఓ ఫార్మా కంపెనీలో ఈనెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్ చేసి కాపాడారు. ఆదివారం స్థానిక MLA వీర్లపల్లి శంకర్ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.
Similar News
News December 28, 2024
నేటి నుంచి APGVB సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్(APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పాలమూరు జిల్లా బ్యాంకు అధికారులు కోరారు. ఈ బ్యాంకుకు ఉమ్మడి పాలమూరులో 85 బ్రాంచ్‌లు ఉన్నాయి.
News December 28, 2024
MBNR: నేటి నుంచి ఉచిత శిక్షణ.. సద్వినియోగం చేసుకోండి
‘సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్& సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. MBNR, NGKL, GDWL, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు చెందిన గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిక్షణ మహబూబ్ నగర్ లోని బండమీదిపల్లి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో ఉంటుందన్నారు.
News December 28, 2024
నవాబుపేట: పిల్లలను వదిలి వెళ్లిన మహిళ.. కేసు నమోదు
ఓ మహిళ ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన ఘటన నవాబుపేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈనెల 25న శబరిమల వెళ్లారు. భార్య అనిత ఈనెల 26న రాత్రి ఇంట్లో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో అత్తామామలకు చెప్పకుండా, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. భర్త శబరిమల నుంచి తిరిగి వచ్చి స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.