News April 3, 2025

MBNR: ‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి’

image

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ బిల్లుకు తాము అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని, రేపు పార్లమెంట్‌కు వస్తే, అక్కడ కూడా మద్దతు ఇస్తామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.

Similar News

News April 10, 2025

కారుమూరి, అంబటికి MLA మాస్ వార్నింగ్

image

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో బుధవారం జరిగిన సభలో MLA బొమ్మిడి నాయకర్ కారుమూరి, అంబటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘కారుమూరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట తీరు మార్చుకో. లేకుంటే తాటతీస్తాం. అంబటి రాంబాబు పద్ధతి మార్చుకోకుంటే నీ సొంత నియోజకవర్గంలో, కార్యకర్తల ముందే బుద్ధి చెప్పాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించారు.

News April 10, 2025

నేటి నుంచి బీజేపీ ‘గావ్ చలో.. బస్తీ చలో’

image

TG: ప్రజల్లో వక్ఫ్ సవరణలపై అవగాహన కల్పించేందుకు గాను బీజేపీ నేటి నుంచి 12వ తేదీ వరకు ‘గావ్ చలో.. బస్తీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తాము చేసిన సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాల్ని నేతలు ప్రజల్లో తిరిగి వివరించనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే. లక్ష్మణ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇందులో భాగస్వాములు కానున్నారు.

News April 10, 2025

కోనసీమ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక 

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.

error: Content is protected !!