News March 1, 2025
MBNR: హక్కుల కోసం కలిసి ముందు కెళ్దాం: మాజీ మంత్రి

గౌడ్స్ హక్కుల కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. HYD నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌లో గౌడ్ సంఘాల నాయకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. మహాసభ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు. నీరా కేఫ్ పై ప్రభుత్వంలో కదలిక రావడం సంతోషమన్నారు. షరతులు లేకుండా నీరా కేఫ్‌ని టాడీ కార్పొరేషన్‌కి అందించాలన్నారు.
Similar News
News March 2, 2025
వనపర్తిలో మిత్రుడు.. CMగా వచ్చాడు! (PHOTO)

CM అయ్యాక స్నేహితుడు మన మధ్యకు వస్తే గూస్బంప్స్ రావాల్సిందే. వనపర్తిలో అదే జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు WNPలో చదివిన రేవంత్ రెడ్డి ఆదివారం CM హోదాలో జిల్లాకు వచ్చారు. ఆనాటి మిత్రులు గుర్తొచ్చి ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హంగు, ఆర్భాటం అన్నీ వదిలేసిన CM స్నేహితులతో కలిసిపోయారు. భోజనం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్నేహానికి మన CM ఇచ్చిన ప్రియారిటీకి హాట్సాఫ్.
News March 2, 2025
MBNR: చికిత్స పొందుతూ యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్ప పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. కౌకుంట్ల మండలం రాజోలికి చెందిన శ్రీకాంత్(25), లింగేశ్లు స్కూటీపై వెళ్తూ టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ నిన్న మృతిచెందగా, లింగేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 2, 2025
MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్‌కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్‌ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.