News April 10, 2024
MBNR,NGKL నియోజకవర్గాల్లో ‘చేయి’ వ్యూహం!

పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది.MBNR,NGKL పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలైన BJP,BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అభ్యర్థులు వంశీచందర్ రెడ్డి,మల్లు రవి స్థానిక ఎమ్మెల్యేలు,నాయకులతో ప్రచారంలో నిమగ్నమయ్యారు.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు పలు సూచనలు చేశారు. మీ కామెంట్?
Similar News
News April 22, 2025
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
News April 22, 2025
రైతుల దగ్గరికే అధికారులు: కలెక్టర్ విజయేంద్ర

మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూభారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 22, 2025
MBNR: వేసవి కరాటే శిక్షణ శిబిరం

వేసవి కరాటే శిక్షణ శిబిరానికి సద్విని చేసుకోవాలని ఉమ్మడి ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ పి వెంకటేష్ కోరారు. వారు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు యువత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగవచ్చు అన్నారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు నిర్వహిస్తున్నామన్నారు.