News April 21, 2024

MBNR:’SUMMER CRICKET’ పేర్లను నమోదు చేసుకోండి!

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జడ్చర్ల, కోస్గిలలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 21న గద్వాల,NGKL,జడ్చర్ల, 22న కల్వకర్తి, 23న కోస్గిలో ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆఫ్లైన్‌లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో ఈనెల 24 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం HCA ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.

Similar News

News October 1, 2024

శ్రీశైలంలో 880.4 అడుగుల నీటిమట్టం

image

శ్రీశైలం జలాశయంలో సోమవారం నీటిమట్టం 880.4 అడుగుల వద్ద 190.3330 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తం 81,607 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.335 M.U విద్యుదుత్పత్తి చేస్తూ 36,163 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 5.356 M.U ఉత్పత్తి చేస్తూ 22,197 మొత్తం 58,360 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ కు విడుదల చేస్తున్నారు.

News October 1, 2024

MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక పత్రాల కోసం ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.

News October 1, 2024

NRPT: డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు

image

డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. 50ఏళ్ల వయసులో రాకొండకు చెందిన జంపుల గోపాల్‌ తెలుగు పండిట్‌ కేటగిరిలో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు, స్కూల్‌ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు. ఆయన కుమారుడు భానుప్రకాశ్‌ నారాయణపేట జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్‌ అసిస్టెంట్‌ 9వ ర్యాంకు సాధించారు. దీంతో తండ్రీకొడుకులకు ప్రశంసలు వెల్లువెత్తాయి.