News April 25, 2024

MBNR:రాష్ట్రంలోనే బైపీసీలో మనమే టాప్!

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన సఫూరా తబస్సుమ్ బైపీసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. బైపీసీలో ఆమెకు 440 మార్కులకు 438 వచ్చాయి. ఇంగ్లిష్‌లో 99 (థియరీ 79, ప్రాక్టికల్స్ 20),అరబిక్‌లో 99, బోటనీలో 60, జువాలజీ 60, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. దీంతో ఆమెకు గ్రామస్థులు, పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Similar News

News December 27, 2024

MBNR: GET READY.. నేటి నుంచి ‘CM CUP-24’ పోటీలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని DSA మైదానంలో సీఎం కప్-2024 పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,584 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. 6 మ్యాట్లపై మ్యాచులు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ నెట్ బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి టోర్నీకి అతిథ్యం లభించింది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెల 2 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

News December 27, 2024

REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్

image

మన్మోహన్ సింగ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. మొదటి పర్యటనలో జులై 1 2004న ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతులకు రూ.19.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం కల్పించారు. రెండోసారి అక్టోబర్ 26 2006న కొత్తకోటలో పర్యటించి.. HYD- బెంగళూరు జాతీయ రహదారి(NH-44) విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ఆయన ఉమ్మడి పాలమూరు వాసుల మనసు గెలుచుకున్నారు.

News December 27, 2024

కొందుర్గు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం గంగన్నగూడానికి చెందిన శేఖర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి సమీపంలో ఉన్న ఉప్పలకుంట చెరువులో శేఖర్ రెడ్డి గతంలో చేపలు బయటకు వెళ్లేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ రెడ్డి తిరిగి రాకపోవడంతో పలుచోట్ల గాలించగా చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య? హత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.