News April 1, 2025

MBNR:సన్నబియ్యం పంపిణీ షురూ..లబ్ధిదారుల ఖుషి

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ఇవాళ షురూ అయింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సన్నబియ్యం సంబరాల వాతావరణం నెలకొంది. ఉదయం 8గంటల నుంచే MBNR, NRPT, GDL, NGKL, WNP జిల్లాలలోని రేషన్‌ షాపులదగ్గర లబ్ధిదారులు బారులుతీరారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నడంతో తెల్లరేషన్ కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 5, 2025

మణిపుర్‌లో శాంతి కోసం ‘పీస్ మీటింగ్’

image

మణిపుర్‌లో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఢిల్లీలో కుకీ, మైతేయి వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ రెండు తెగల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఆ రాష్ట్రంలో శాంతిని తిరిగి నెలకొల్పుతామని ఇటీవల పార్లమెంటులో అమిత్ షా ప్రకటించారు. మైతేయిలకు ST హోదా కల్పించొద్దని కుకీలు ఆందోళన చేయడం అక్కడ హింసాత్మక ఘటనలకు కారణమైన సంగతి తెలిసిందే.

News April 5, 2025

SBI UPI సేవల్లో అంతరాయం!

image

UPI సేవల్లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు SBI ప్రకటన విడుదల చేసింది. దీని కారణంగా వినియోగదారులకు UPI సేవల్లో తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని SBI వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతరాయం లేకుండా ఉండేందుకు UPI LITE వాడాలని సూచించింది. మీకూ ఈ సమస్య ఎదురైందా? COMMENT

News April 5, 2025

గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ పనులు వేగవంతం

image

గుంటూరు-గుంతకల్లు మధ్య 2వ రైలు మార్గం పనులు 347కి.మీ పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 401 కి.మీ మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.3,631 కోట్లు భరిస్తామని ఐదేళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తైతే ఈ మార్గంలో నడిచే రైళ్ళకు గంటన్నర సమయం ఆదా అవుతుందని అంటున్నారు. 

error: Content is protected !!