News October 8, 2025
MBUలో అక్రమ వసూళ్లు ఇలా..!

మోహన్ బాబు యూనివర్సిటీలో వివిధ రూపాల్లో నగదు <<17945897>>వసూళ్లు <<>>చేశారని తెలుస్తోంది. 2022-23లో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ.24,500, 23-24, 24-25లో రూ.37వేలు వసూళ్లు చేశారు. ఇలా 2022-23లో రూ.2.59 కోట్లు, 23-24లో రూ.10.65 కోట్లు, 24-25లో రూ.12.93 కోట్లు రాబట్టారు. CAMU సాప్ట్‌వేర్‌తో విద్యార్థుల అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. ఇందులోనూ తప్పుడు హాజరు చూపించి ఒక్కొక్కరి నుంచి రూ.7,500 వసూళ్లు చేశారట.
Similar News
News April 4, 2026
నర్సంపేట కేంద్రంగా స్కానింగ్ దందా?

గర్భిణులకు పుట్టబోయేది పాప, బాబునా? అని చెప్పేందుకు నర్సంపేట అడ్డాగా మారినట్లు పోలీసులు గుర్తించారు. పున్నేలులో జరిగిన హత్యలకు కారణం కూడా అక్కడి వ్యక్తేనని తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధమని తెలిసినా, వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఈ దందా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News April 4, 2026
ఎల్లోతో ప్రేమలో పడిపోయా.. మీనా ఫొటో వైరల్

తొలిసారి ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించినట్లు నటి మీనా తెలిపారు. నిన్న CSK-PBKS మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో దిగిన ఫొటోను Xలో షేర్ చేశారు. ‘తొలిసారి లైవ్ చూశా. ఎల్లో(CSK)తో లవ్‌లో పడిపోయా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఎప్పటికీ తరగని అందం ఆమెదని కొందరు కామెంట్ చేయగా, CSKలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటూ మరికొందరు ఆరా తీశారు. 90sలో వెలుగు వెలిగిన మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘దృశ్యం’తో అదరగొట్టారు.
News April 4, 2026
పులిని బంధించేందుకు నెలకోట చేరిన మహారాష్ట్ర బృందం

పోలవరం(D) నేలకోట కొండ వద్ద మకాం వేసిన పులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి 12 మంది సభ్యుల బృందాన్ని శుక్రవారం ఏలూరు, రంపచోడవరం, రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులతో కలిసి నేలకోట, గండికోట మధ్యలో బృందం మాటువేసింది. పెదకొండేపూడిలో గోశాల వద్ద మరో బృందాన్ని ఉంచారు. ఈ రాత్రికి పులిని బంధించడం లేదా రిజర్వు ఫారెస్టు వైపు పులిని దారి మళ్లించేలా ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.


