News February 20, 2025
MCA పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 21వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చెల్లించవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
Similar News
News November 2, 2025
BIG BREAKING: వికారాబాద్ జిల్లాలో ముగ్గురి MURDER, ఒకరిపై హత్యాయత్నం

ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి తాను సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య అతడి భార్య, కుమార్తె, వదినను కత్తితో పొడిచి చంపి, మరో కుమార్తెను చంపేందుకు యత్నించాడు. అనంతరం తాను సూసైడ్ చేసుకున్నాడు. పరిగి DSP శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
HYDలో KCR చేసింది ఏం ఉంది: CM రేవంత్ రెడ్డి

HYDలో KCR అభివృద్ధి చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రగడ్డలో నవీన్ యాదవ్‌కు మద్దతుగా CM రోడ్ షో నిర్వహించారు. ‘సిటీకి YSR మెట్రో తెచ్చారు. ORR, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ నిర్మించింది. IT, ఫార్మా కంపెనీలు మేమే తీసుకొచ్చాము. చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరి HYDలో KCR చేసింది ఏం ఉంది’ అంటూ రేవంత్ నిలదీశారు. దీనిపై మీ కామెంట్?
News November 1, 2025
హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.


