News January 30, 2025
MCC తక్షణమే అమలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో MCC తక్షణమే అమలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) తక్షణమే అమలులోకి వస్తుందని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చు 3న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
Similar News
News October 16, 2025
మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News October 15, 2025
MDK: ‘రూల్స్ పాటించకపోతే చర్యలే’

ప్రతి దీపావళికి జిల్లాలో 250 వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. మెదర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ తదితర ఏరియాల్లో భారీగా వెలుస్తాయి. అయితే దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టపాసుల షాపులను నిబంధనల మేరకే ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
News October 15, 2025
రామాయంపేట: ఇంట్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివనగర్ తండాలో మంగళవారం రాత్రి మున్యా(36) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.