News January 30, 2025
MCC తక్షణమే అమలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో MCC తక్షణమే అమలవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(MCC) తక్షణమే అమలులోకి వస్తుందని మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చు 3న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
Similar News
News September 13, 2025
మెదక్: లోక్ ఆదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం: ప్రధాన న్యాయమూర్తి

జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్‌ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.
News September 13, 2025
మెదక్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్

మెదక్ జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ నీలిమ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం.శుభవల్లి పర్యవేక్షించారు. రాజీ మార్గమే రాజమర్గమన్నారు. ఈ సందర్బంగా పలువురు తమ కేసుల్లో రాజీ పడ్డారు. న్యాయమూర్తులు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్, స్వాతి, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
News September 13, 2025
మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.