News November 13, 2025
MCEMEలో 49 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Similar News
News November 13, 2025
స్వస్తివచనం ఎందుకు చేయాలి?

చేయబోయే పనులు విజయవంతం కావాలని, మనతో పాటు చుట్టూ ఉన్న అందరికీ మేలు కలగాలని కోరుతూ పలికే పవిత్ర ప్రార్థననే ‘స్వస్తి వచనం’ అంటారు. సంకల్పంతో కొన్ని ప్రార్థనలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన పనులకున్న అడ్డంకులు తొలగిపోతాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తే, ఆ సానుకూల శక్తి తిరిగి మనకే బలాన్నిస్తుంది. లక్ష్యాలకు విజయాన్ని చేరుస్తుంది. అందుకే ఏ కార్యాన్ని మొదలుపెట్టినా స్వస్తివచనం తప్పక ఆచరించాలి.
News November 13, 2025
ప్రెగ్నెన్సీలో జామపండ్లు తినొచ్చా?

జామపండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీటిని తినడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది. అలాగే శిశువులో నాడీలోపాలు రాకుండా, తల్లిలో యాంగ్జైటీ రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
News November 13, 2025
మార్నింగ్ అప్డేట్స్

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం


