News April 15, 2025
MDCLలో పలుచోట్ల కురిసిన మోస్తరు వర్షం!

MDCL జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఘట్కేసర్లో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు TGDPS తెలిపింది. కీసరలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. HYD బండ్లగూడ, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి.
Similar News
News December 17, 2025
రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కీలకమని, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
News December 17, 2025
గంభీరావుపేట సర్పంచ్గా పద్మ విజయం

గంభీరావుపేట మండల కేంద్రం గ్రామ సర్పంచ్గా మల్లుగారి పద్మ ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గంభీరావుపేట గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించి ఆశీర్వదించిన గ్రామస్థులందరికీ నూతన సర్పంచ్ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.
News December 17, 2025
వారసత్వంగా వచ్చిన ఇంటికి వాస్తు పాటించాలా?

వారసత్వంగా వచ్చిన ఇంటికీ వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా శుభ ఫలితాలు కొనసాగుతాయంటున్నారు. ‘మీ పేరు బలం, జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా ఇంటి సింహద్వారం, ఇతర చిన్నపాటి మార్పులు చేసుకోవడం మంచిది. తద్వారా వారసత్వంగా వచ్చిన సుఖసంతోషాలు, సిరిసంపదలు అనుభవించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లేదంటే, పరిస్థితులు మారి కష్టాలు రావచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


