News April 15, 2025

MDCLలో పలుచోట్ల కురిసిన మోస్తరు వర్షం!

image

MDCL జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఘట్కేసర్లో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు TGDPS తెలిపింది. కీసరలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. HYD బండ్లగూడ, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి.

Similar News

News April 18, 2025

వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.

News April 18, 2025

గుడివాడలో విజయవాడ యువకుడి వీరంగం

image

గుడివాడలో విజయవాడ యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన సమాచార ప్రకారం విజయవాడలో మాచవరానికి చెందిన సాయి గుడివాడ వెళ్లి దుర్గాప్రసాద్‌పై శుక్రవారం బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన దుర్గాప్రసాద్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా సాయిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

News April 18, 2025

ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్థాగత ఎన్నికలు: ఎంపీ శ్రీభరత్

image

T.D.P. సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలను ఎన్నుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!