News February 6, 2025
MDCL: అకౌంట్లలో రైతు భరోసా పడుతోంది: DAO

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 4825 మంచి రైతులకు సంబంధించి రూ.3.74 కోట్లు ట్రెజరీకి పంపగా, గ్రామసభలు జరిగిన తెల్లారి 2706 మంది రైతులకు రూ.3.13కోట్ల రైతుల భరోసా అకౌంట్లలో జమైందని DAO చంద్రకళ తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఏ రైతూ కంగారు పడాల్సిన అవసరం లేదని, సాగుకు యోగ్యమైన మిగతా రైతులందరికీ రైతు భరోసా పడనుందని పేర్కొన్నారు.
Similar News
News March 27, 2025
DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
News March 27, 2025
పలాస: పెళ్లయినా 50 రోజులకు యువకుడి మృతి

పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.