News February 16, 2025

MDCL: ఇంటర్ విద్యార్థుల్లో ఒత్తిడి, నిద్రలేమి

image

ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కారానికి టెలీ మానస్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలో డిసెంబర్, జనవరి నెలల్లో జిల్లాల వారీగా టెలీ మానస్ కేంద్రానికి వచ్చిన సమస్యలపై 14 మంది ఒత్తిడికి గురవుతున్నామని, ఇద్దరు సరిగ్గా నిద్ర పట్టడం లేదని, ఇతర సమస్యలతో 13 మంది టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News November 14, 2025

ములుగు కలెక్టర్‌ను ఇంటర్వ్యూ చేసిన బాలలు

image

ములుగు కలెక్టర్ దివాకర్‌ను విద్యార్థులు ఇంగ్లిషులో ఇంటర్వ్యూ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లిష్ లెర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్‌తో ముఖాముఖి నిర్వహించారు. అలవాట్లు, అభిరుచులు, తదితర విషయాలను అడిగారు. జిల్లాలోని 72 ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ చదవడం, నేర్చుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

News November 14, 2025

మంత్రి లోకేశ్‌తో ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలపై చర్చలు

image

CII సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే, విశాఖ జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను కలిశారు. తీరప్రాంత, సముద్ర పరిశోధన, ఉష్ణమండల వ్యాధుల అధ్యయనాలు, స్థిరమైన పర్యాటకం,గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఏయూ భాగస్వామ్య బలోపేతంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఉష్ణమండల నీటి పరిశోధన, ఆరోగ్యసంరక్షణ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు.

News November 14, 2025

వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

image

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.