News March 17, 2025
MDCL: ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసాలతో జాగ్రత్త

రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లో రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ నిర్వహించారు. ఇందులో SEBI ED రామ్మోహన్ రావు మాట్లాడుతూ..ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్, SEBI ద్వారా నిబంధనలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానాల గురించి తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.
News March 17, 2025
అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు: మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. దేవాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన తనకు ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా అందజేశారని సభలో వెల్లడించారు.
News March 17, 2025
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు

TG: అసెంబ్లీలో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారు. జనాభా ప్రాతిపదికన మొదటి గ్రూపులో 15 కులాలు, రెండో గ్రూపులో 18, మూడో గ్రూపులో 26 కులాలను చేర్చింది.