News April 9, 2025
MDCL: ఏప్రిల్ 15 నుంచి ITI సప్లిమెంటరీ పరీక్షలు

ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ITI సప్లిమెంటరీ CBT పరీక్ష జరగనున్నట్లుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ ప్రభుత్వం ఐటీఐ కాలేజీ యజమాన్య బృం దం తెలిపింది. త్వరలోనే విద్యార్థులకు హాల్ టికెట్లు వస్తాయని, విద్యార్థులందరూ సిద్ధం కావాలని సూచించింది. గతంలో ఉన్న తేదీలను ITI నేషనల్ బృందం వాయిదా వేసినట్లు పేర్కొంది.
Similar News
News December 10, 2025
రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్‌ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి
News December 10, 2025
పల్నాడు: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు.?

టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


