News March 29, 2025

MDCL: గిరిజన తండాలు.. గొప్పగా మారేనా..?

image

MDCL మల్కాజిగిరి పరిధిలోని 61 గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీల కిందికి వెళ్లనున్న నేపథ్యంలో గిరిజన తండాలు గొప్ప అభివృద్ధి ప్రాంతాలుగా మారుతాయా..? అని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మా వెనుకబడ్డ గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News April 3, 2025

NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

image

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%

News April 3, 2025

ప్రకాశం: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

image

స్థల వివాదం నేపథ్యంలో CISF కానిస్టేబుల్‌ నాగేశ్వరరావుపై దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో జరిగింది. భరత్, వీరయ్య, లక్ష్మీనారాయణకు, నాగేశ్వరరావుకు స్థల గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై మరో ఇద్దరితో కలిసి వారు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో బుధవారం 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

error: Content is protected !!