News January 26, 2025
MDCL: నేటితో ముగియనున్న పాలకవర్గ గడువు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గ గడువు నేటితో ముగిసింది. నేటితో పాలకవర్గం సభ్యులు ఐదేళ్ల గడువు పూర్తి చేసుకున్నారు. ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, మేడ్చల్ లాంటి మున్సిపాలిటీలు, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లో సహా ఇందులో ఉన్నాయి. గత ఐదేళ్లలో 2024 వరకు BRS సభ్యుల ఆధిక్యం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో పురపాలికల్లో కాంగ్రెస్ పాగా వేసింది.
Similar News
News December 14, 2025
పాలకొల్లులో వైసీపీ రాష్ట్ర నేతకు సీఐడీ నోటీసులు

వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళకు సీఐడీ అధికారులు పాలకొల్లులో నోటీసులు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో 2022లో పాలకొల్లు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ కేసు దర్యాప్తులో భాగంగా తనకు ఈ నోటీసులు ఇచ్చారని, ఈ నెల 15న రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నట్లు చంద్రకళ తెలిపారు.
News December 14, 2025
వరంగల్: ఒక్క ఓటుతో గెలిచిన కొంగర మల్లమ్మ

వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్సీ అభ్యర్థులు లేరని ఏకగ్రీవం అవుతుందని భావించిన ఈ గ్రామంలో అనూహ్యంగా మరో యువతి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ తప్పలేదు. మొత్తం 1,647 ఓట్లు పోలవగా, చివరి లెక్కింపులో కొంగర మల్లమ్మ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫలితం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
News December 14, 2025
HYD: వెస్ట్ సిటీలో కీలక మార్పులు

GHMC డీ-లిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వెస్ట్ సిటీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో కనీసం 4 నుంచి 5 కొత్త డివిజన్లు పెరగనున్నాయి. 2011 జనాభా, ఓటర్ల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రాంతాల్లోని ఓటర్లలో బిహార్, బెంగాల్, ఒడిశా వలసదారులు అధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కొత్త డివిజన్లతో ఈ ప్రాంత రాజకీయ సమీకరణాలు మారడం ఖాయం.


