News January 26, 2025
MDCL: నేటితో ముగియనున్న పాలకవర్గ గడువు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గ గడువు నేటితో ముగిసింది. నేటితో పాలకవర్గం సభ్యులు ఐదేళ్ల గడువు పూర్తి చేసుకున్నారు. ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, మేడ్చల్ లాంటి మున్సిపాలిటీలు, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లో సహా ఇందులో ఉన్నాయి. గత ఐదేళ్లలో 2024 వరకు BRS సభ్యుల ఆధిక్యం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో పురపాలికల్లో కాంగ్రెస్ పాగా వేసింది.
Similar News
News February 10, 2025
నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
News February 10, 2025
వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.
News February 10, 2025
కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.