News March 28, 2025

MDCL: మిషన్ భగీరథ ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు

image

HYDలో MDCL,RR సహా ఇతర జిల్లాల మిషన్ భగీరథ CE, SE, DE ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమావేశమై పలు సూచనలు చేశారు. ✓ఇంజినీర్లు వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి✓మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు✓పండుగల సమయంలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు✓అభివృద్ధి పనుల వల్ల పైపుల డ్యామేజ్ కాకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం✓ కొత్త బోర్ల వైపు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి.

Similar News

News November 1, 2025

చిత్తూరు: 5 కేసుల్లో 9 మందికి ఉరి శిక్ష…!

image

చిత్తూరు కోర్టులో మొత్తం 5 ఉరి శిక్షలు పడ్డాయి. తాజాగా కటారి కేసులో ఐదుగురికి, 1988లో ఇద్దరిని హత్య చేసిన కేసులో ఒకరికి, 1992 హత్య కేసులో మరొకరికి శిక్ష పడింది. 2020లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఒకరికి, 2023లో మహిళ, ఆమె తల్లిని చంపిన కేసులో విధించారు.

News November 1, 2025

GNT: నేటికి 41ఏళ్లు.. మొదటి లోకాయుక్త మన వారే.!

image

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వ్యవస్థ 1983 నవంబర్ 1న ఏర్పాటయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ. మొదటి లోకాయుక్తగా అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు నియమితులయ్యారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. కాగా ఆయన మన ఉమ్మడి గుంటూరు జిల్లా మూల్పూరులో జన్మించారు.

News November 1, 2025

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.