News March 28, 2025

MDCL: మిషన్ భగీరథ ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు

image

HYDలో MDCL,RR సహా ఇతర జిల్లాల మిషన్ భగీరథ CE, SE, DE ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమావేశమై పలు సూచనలు చేశారు. ✓ఇంజినీర్లు వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి✓మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు✓పండుగల సమయంలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు✓అభివృద్ధి పనుల వల్ల పైపుల డ్యామేజ్ కాకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం✓ కొత్త బోర్ల వైపు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి.

Similar News

News April 18, 2025

VIRAL: నీ కష్టం పగోడికి కూడా రావొద్దు బ్రో!

image

తన ప్రియురాలు తనకంటే 22 ఏళ్లు పెద్దదని తెలియడంతో ఓ యువకుడు SMలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాకు 26 ఏళ్లు. నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నా. కొన్ని రోజుల క్రితం ఆమె వయసు 27 కాదు, 48 అని తెలిసింది. ఆమె అంత వయసైనట్లు కనిపించదు. ఆమె స్నేహితులు 30+ వాళ్లే ఉండేవాళ్లు. ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే ఇచ్చేది కాదు. ల్యాప్‌టాప్‌లో పాస్‌పోర్టు చూడటంతో ఇది తెలిసింది. నేనిప్పుడు ఏం చేయాలి?’ అని అతను వాపోయాడు.

News April 18, 2025

NZB: దాశరథి పురస్కారానికి జిల్లా వాసి ఎంపిక

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్‌ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్‌లో పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు.

News April 18, 2025

వినూత్నంగా కేఎల్ రాహుల్ కూతురు పేరు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ పాపకు ‘ఇవారా విపులా రాహుల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవారా అంటే అర్థం ‘దేవుడి బహుమతి’ అని పేర్కొన్నారు. పాప ‘నానీ’ గౌరవార్థం విపులా అని పెట్టినట్లు తెలిపారు.

error: Content is protected !!