News February 19, 2025

MDCL: మీ సేవలపై ఇలా ఫిర్యాదు చేయండి..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి అనేక ప్రాంతాల్లో రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ మీ సేవల్లో కొనసాగుతుంది. దరఖాస్తుకు అధిక ధరలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.దీని పై తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ హెల్ప్ లైన్ నంబర్ 040-45676699కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మేడ్చల్ అధికారులు సూచించారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం కేవలం రూ.45 రుసుము మాత్రమే చెల్లించాలని సూచించారు.

Similar News

News October 29, 2025

జగిత్యాల: నూతన డీపీవోగా వై.రేవంత్ బాధ్యతలు స్వీకరణ

image

పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా వై.రేవంత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో పంచాయతీ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రేవంత్ తెలిపారు.

News October 29, 2025

తిరుపతి కథలకు పురస్కారం

image

‘తిరుపతి కథలు’ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి రచయిత ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News October 29, 2025

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లకు కాల్ సెంటర్ ప్రారంభం

image

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. రైతులు కొనుగోళ్లకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-8187కు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తెలియజేయవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.