News April 5, 2025
MDCL: మొక్కకు నీరందించే బెస్ట్ టెక్నిక్.. ఇదే..!

HYD, RR, MDCL, VKB జిల్లా వ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు పలుచోట్ల మొక్కలు నాటుతుంటారు. అలాంటివారికి IFS అధికారి మోహన్ కొత్త టెక్నిక్ పరిచయం చేశారు. మొక్కనాటే ముందు గుంత తవ్వి, అందులో కంకర వేసి, ప్రత్యేకంగా పైపు ఏర్పాటు చేసి, కంకర నింపాలని, ఆ తర్వాత మొక్క నాటాలన్నారు. డైరెక్ట్ పైపులో నీరు పోస్తే, డైరెక్ట్ మొక్క వేర్లకు నీరు అందుతుంది, ఏపుగా ఎదుగుతుందని, నీరు వృథా కావన్నారు.
Similar News
News April 7, 2025
HYD: ఈషాసింగ్ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో ఈషా సింగ్కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో ఇది దేశానికి మూడో పతకం.
News April 7, 2025
అమలాపురం: ఎస్పీ గ్రీవెన్స్కు 25 ఫిర్యాదులు

అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు 25 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదించాలన్నారు.
News April 7, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 73 ఫిర్యాదులు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన 73 దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల సమస్యలు, రెండు పడకగదుల ఇళ్లు, రైతు భరోసా, పింఛన్లు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.