News February 4, 2025
MDCL: వాష్ రూంలో టూత్ బ్రష్ పెడుతున్నారా..? జాగ్రత్త!

వాష్ రూంలో పెట్టే మీ టూత్ బ్రష్ పళ్లను పాడు చేస్తుంది. జాగ్రత్త..! సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు దాదాపు 45 రోజుల పాటు చేసిన పరిశోధనలలో ఈ విషయాలు వెల్లడైనట్లు MDCL డాక్టర్ సంధ్య తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగిందని బాత్రూం బ్యాక్టీరియా బ్రష్పై చేరి, అనంతరం దంతాలపై ప్రభావం పడుతుందన్నారు.
Similar News
News September 15, 2025
రేపు భారీ వర్షాలు

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News September 15, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ‘పోషణ్ మా’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించి, ‘ఎనీమియా ముక్త నిర్మల్’ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 15, 2025
శ్రీశైలంలో కోటి దీపోత్సవం ఎప్పుడంటే?

కార్తీక మాసం మొదలు, పూర్తయ్యే వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో అభిషేకాలు నిలిపి వేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో వేకువజామున 4:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు. లడ్డూ ప్రసాదాల విక్రయాల కోసం పది కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ ఒకటో తేదీన గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం జరుగుతుందని చెప్పారు.