News February 4, 2025
MDCL: వాష్ రూంలో టూత్ బ్రష్ పెడుతున్నారా..? జాగ్రత్త!

వాష్ రూంలో పెట్టే మీ టూత్ బ్రష్ పళ్లను పాడు చేస్తుంది. జాగ్రత్త..! సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు దాదాపు 45 రోజుల పాటు చేసిన పరిశోధనలలో ఈ విషయాలు వెల్లడైనట్లు MDCL డాక్టర్ సంధ్య తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగిందని బాత్రూం బ్యాక్టీరియా బ్రష్‌పై చేరి, అనంతరం దంతాలపై ప్రభావం పడుతుందన్నారు.
Similar News
News February 16, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్ సిరి

కర్నూలులో నేడు జరగాల్సిన PGRS కార్యక్రమం రద్దయింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలు, అధికారులతో బిల్ గేట్స్ బృందంతో నేడు సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ప్రజలు గమనించాలని అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మండల స్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు కూడా వీసీలో పాల్గొంటారని చెప్పారు.
News February 16, 2026
ఉదయగిరి జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 16, 2026
154 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 154 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ అసెస్‌మెంట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com


