News November 18, 2025
MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.
Similar News
News November 18, 2025
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

పేరెంట్-టీచర్స్ మీటింగ్ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.