News April 5, 2025

MDCL: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవే..!

image

MDCL జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు.ఘట్కేసర్ మండలంలో 1.ప్రతాపసింగారం, 2.ఏదులాబాద్, 3.మాదారం.. మూడు చింతలపల్లి మండలంలో 4.కేశవరం, 5.లక్ష్మాపూర్, 6.ఉద్దమర్రి, మేడ్చల్ మండలంలో 7.మేడ్చల్ 8.డబుల్పురా, 9.పూడూరు, 10.శామిర్పేట్, 11.అలియాబాద్, 12.కీసర మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 14, 2025

బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు

image

బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలో వేద పండితుల మధ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పలువురు శుభాకాంక్షలు చెప్పారు.

News September 14, 2025

SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

image

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

జూరాల ప్రాజెక్టుకు 9 గేట్లు ఎత్తివేత

image

ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టుకు 1 లక్ష క్యూసెక్కులు వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9 స్పిల్ వే గేట్లు ఓపెన్ చేసి 62,406 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 38,271, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 1,01,272 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.