News April 5, 2025
MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్‌ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.
Similar News
News April 12, 2025
ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు:BRS

వరంగల్‌లో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ రజజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని.. ఢిల్లీ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కేసిఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
News April 12, 2025
టీటీడీ కోటి విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1 కోటిని వైజాగ్‌కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్‌ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు.
News April 12, 2025
3 నెలల్లో 85వేల వీసాలు.. చైనా స్నేహహస్తం!

సరిహద్దు వివాదాలతో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వే చైనా కొంతకాలంగా మెతక వైఖరి అవలంబిస్తోంది. ఇటీవల సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న చైనా తాజాగా భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత 3 నెలల్లో 85 వేల వీసాలు ఇచ్చామని చైనీస్ ఎంబసీ తెలిపింది. ‘చైనాను సందర్శించేందుకు మరింత మంది ఇండియన్ ఫ్రెండ్స్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.