News August 30, 2025

MDCL: డిజేలు నడపొద్దు: DCP

image

మల్కాజ్‌గిరి పరిధిలో డీజే ఆపరేటర్లకు డీసీపీ పద్మజ వివిధ పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు నడపొద్దని, ఒకవేళ నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరగటానికి అందరు సహకరించాలని డీసీపీ కోరారు.

Similar News

News August 31, 2025

భారత డ్రోన్స్‌ను US, చైనా కనిపెట్టలేవు: రాజ్‌నాథ్

image

దేశంలో ‘న్యూ టెక్నలాజికల్ రెవల్యూషన్‌’కు ఇండియన్ డ్రోన్స్ సింబల్‌గా మారాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్‌ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. ‘నేటి యువత కంపెనీ ఏర్పాటు చేయడం కాదు.. సరికొత్త ఆలోచనలతో డిఫెన్స్ సెక్టార్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇండియన్ డ్రోన్స్ ఎగిరినప్పుడు.. అమెరికా, చైనా కూడా వాటిని కనిపెట్టలేవు. ఇది చాలా గొప్ప విషయం’ అని వ్యాఖ్యానించారు.

News August 31, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 31, 2025

నేడు, రేపు వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.