News January 26, 2025
MDCL: నేటితో ముగియనున్న పాలకవర్గ గడువు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గ గడువు నేటితో ముగిసింది. నేటితో పాలకవర్గం సభ్యులు ఐదేళ్ల గడువు పూర్తి చేసుకున్నారు. ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, మేడ్చల్ లాంటి మున్సిపాలిటీలు, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లో సహా ఇందులో ఉన్నాయి. గత ఐదేళ్లలో 2024 వరకు BRS సభ్యుల ఆధిక్యం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో పురపాలికల్లో కాంగ్రెస్ పాగా వేసింది.
Similar News
News January 11, 2026
అనంత: పండుగ ముంగిట విషాదాంతం

పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నిండింది. కూడేరు(M) జల్లిపల్లికి చెందిన ఉదయ్ కిరణ్(12) ఆటోలో ఆడుకుంటుండగా ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. ముందుకెళ్లి బోల్తాపడి బాలుడు మృతిచెందాడు. బ్రహ్మసముద్రం(M) పోలేపల్లి వద్ద BTP కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నీటిలో ఊపిరాడక కపటలింగనపల్లికి చెందిన నితిన్(15) మరణించాడు. అనంతపురం పోలీస్ కంట్రోల్ రూములో ఎస్సైగా పనిచేస్తున్న మోహన్ ప్రసాద్(61) గుండెపోటుతో మృతిచెందారు.
News January 11, 2026
విడాకుల వెనక చీకటి కోణం.. మౌనం వీడిన మేరీ కోమ్!

బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన విడాకుల వెనుక ఉన్న కారణాలను బయటపెట్టారు. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను భర్త ఓన్లర్ తన పేరు మీదకు మార్చుకున్నారని, భారీగా అప్పులు చేసి తనను దాదాపు దివాలా తీయించారని ఆరోపించారు. 2022లో గాయపడి మంచంపై ఉన్నప్పుడు ఈ నిజాలు తెలిసి షాక్ అయ్యానన్నారు. తన వ్యక్తిత్వంపై SMలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్లే ఇప్పుడు మౌనం వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
News January 11, 2026
నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


