News March 28, 2025

MDCL: మిషన్ భగీరథ ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు

image

HYDలో MDCL,RR సహా ఇతర జిల్లాల మిషన్ భగీరథ CE, SE, DE ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమావేశమై పలు సూచనలు చేశారు. ✓ఇంజినీర్లు వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి✓మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు✓పండుగల సమయంలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు✓అభివృద్ధి పనుల వల్ల పైపుల డ్యామేజ్ కాకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం✓ కొత్త బోర్ల వైపు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి.

Similar News

News March 31, 2025

మెరుగైన వైద్యం కోసం ముంబైకి కొడాలి నాని 

image

మాజీ మంత్రి కొడాలి నానిని మెరుగైన వైద్యం కోసం వైద్యులు ముంబైకి తరలిస్తున్నారు. హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమా అనే విషయాన్ని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు మాజీ మంత్రి కొడాలి నానిని తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, అనుచరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

News March 31, 2025

మాజీ క్రికెటర్‌తో నటి మలైకా డేటింగ్?

image

శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ సంగక్కరతో నటి మలైకా అరోరా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న గువాహటిలో CSKతో మ్యాచ్ సందర్భంగా ఆమె సంగక్కర పక్కన RR జెర్సీ ధరించి కూర్చున్నారు. ఈ ఫొటో SMలో వైరల్ కాగా, డేటింగ్ రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల హీరో అర్జున్ కపూర్‌‌కు బ్రేకప్ చెప్పిన ఆమె మాజీ క్రికెటర్‌తో రిలేషన్‌ స్టార్ట్ చేశారని చర్చించుకుంటున్నారు.

News March 31, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు.

error: Content is protected !!