News April 4, 2025
MDCL: మీకు కార్లు.. మాకు కాలినడకా..?

MDCL జిల్లా అంతాయిపల్లిలో కలెక్టరేట్ ప్రారంభమై ఏళ్లు గడుస్తుంది. కానీ.. ఇప్పటికీ కలెక్టరేట్ వెళ్లేందుకు సరైన ప్రయాణ సౌకర్యంలేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో దొంగల మైసమ్మ దేవాలయం వద్ద ఆర్టీసీ బస్ దిగి 3.5KM నడవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు, సంపన్నులు ఆఫీసుకు కార్లలో వెళ్తున్నారన్నారు. మీకు కార్లు.. మాకు కాలినడకా..? అని ప్రశ్నించారు.
Similar News
News April 12, 2025
ALERT: వడగాలులు బాబోయ్!

AP: రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్ఠకు చేరింది. మధ్యాహ్నవేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News April 12, 2025
టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

TG: TPCCకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. BC సామాజిక వర్గ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశాన్ని కల్పించే దిశగా కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పీసీసీని పూర్తిస్థాయిలో విస్తరించొచ్చని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
News April 12, 2025
గూగుల్‌లో భారీగా కొలువుల కోత

గూగుల్ మరోసారి కొలువుల తొలగింపు ప్రారంభించింది. వందలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ప్రధానంగా ఆండ్రాయిడ్, పిక్సెల్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే టెకీలపై వేటు వేసింది. చివరిగా 2023లోనూ 12వేలమందిని ఆ సంస్థ తొలగించిన సంగతి తెలిసిందే. ఆంక్షల యుద్ధాల నడుమ ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో గూగుల్ బాటలోనే మరిన్ని సంస్థలు కొలువుల కోత బాట పట్టొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.