News July 10, 2025
MDCL: రూమ్ మార్చేసాం.. ఫ్రీ కరెంట్ కోసం ఏం చేయాలి.?

ఉప్పల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కిరాయికి ఉండే వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలవుతుంది. అయితే వారు రూమ్ ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి వెళ్లి కిరాయి ఉంటున్న సమయంలో ఇబ్బందులు కలుగుతున్నట్లు పలువురు తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రాంతంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు పొందడం కోసం ఏం చేయాలి.? అనేది తెలియటం లేదని, అధికారులు స్పందించాలని కోరారు.
Similar News
News July 10, 2025
BREAKING: సిరిసిల్ల: నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్(25) ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందాడు. గురువారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News July 10, 2025
కూకట్‌పల్లి: కల్తీ కల్లులో అత్యధికంగా మత్తుమందు

కల్తీ కల్లు ఘటనలో అధికారులు వివరాలు వెల్లడించారు. హైదర్‌నగర్, HMT హిల్స్, సర్దార్ పటేల్‌నగర్, భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లోని శాంపిల్స్ సేకరించారు. భాగ్యనగర్ కాలనీ మినహా మిగతా మూడింట్లో మత్తుమందు అల్ఫాజోలం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించారు. నిందితులు రవితేజగౌడ్, సాయితేజగౌడ్, నగేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
News July 10, 2025
VKB: ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: స్పీకర్

అనంతపద్మనాభ స్వామి కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం వద్ద చిన్న జాతర పెరుగు బసంతంలో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంత పద్మనాభ స్వామికి మొక్కులు మొక్కితే ఇట్టే తీరిపోతాయని పేర్కొన్నారు.