News May 7, 2025
MDCL: రూ.500లతో 6 దేవాలయ దర్శనం

MDCL ఆర్టీసీ అధికారులు బెస్ట్ టెంపుల్ టూర్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. కేవలం పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 ఛార్జితో ఏకంగా బద్రీనాథ్ టెంపుల్, వర్గల్ జ్ఞాన సరస్వతి టెంపుల్, కొమరవెల్లి మల్లన్న, అలియాబాద్ వెంకటేశ్వర స్వామి, చీర్యాల లక్ష్మీనరసింహస్వామి, భువనగిరి స్వర్ణగిరి దేవాలయాలు దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ బస్ స్పెషల్ మెట్రో ఎక్స్ ప్రెస్ కావడంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదన్నారు.
Similar News
News April 14, 2026
VJA: బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్!

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రసాదంపాడుకు చెందిన రాజేశ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. IPL ప్రారంభం అవ్వగానే సబ్ బుకీ అవతారమెత్తాడు. రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నాడు. అతనిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరిస్తున్న ఆనంద్ రెడ్డి, శివయ్యలను అదుపులోకి తీసుకున్నారు.
News April 14, 2026
కామారెడ్డిలో కూరగాయల ధరలు ఇలా!

కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరలు మంగళవారం సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.20గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.50, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.50, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి. ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
బాపట్ల: ఫైఓవరపై దొరికిన వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి

బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుంటూరు రహదారి ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలితం లేక మరణించాడని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


