News March 2, 2025

MDCL: 1.21 లక్షల రేషన్ కార్డులు పెండింగ్..!

image

మేడ్చల్ జిల్లాలోని GHMC ప్రాంతం, మున్సిపాలిటీలు, మండలాల నుంచి 1,21,016 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవి DCSO లాగిన్‌లో పెండింగ్లో ఉన్నాయి. కాగా.. MDCL రూరల్లో గ్రామ, వార్డు సభల్లో స్వీకరించిన 33,435 దరఖాస్తులను, ప్రభుత్వం నిర్వహించిన కుల గణన ద్వారా వేరిఫై చేసి, వీటి నుంచి 6,700 కార్డులు తాజాగా మంజూరు చేశారు. దీంతో మిగితా వారు రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు.

Similar News

News September 16, 2025

KNR: శిశు సంరక్షణ కేంద్రాల పరిశీలన

image

కరీంనగర్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని వాకాడే పరిశీలించారు. లోకల్ బాడీస్ జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమె కమిటీ సభ్యులతో కలిసి ఈ కేంద్రాలను సందర్శించారు. వెంకట్ ఫౌండేషన్ బాల గోకులం, సంక్షేమ ట్రస్ట్ కపిల్ కుటీర్, ఓపెన్ షెల్టర్లలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News September 16, 2025

సీఎం సమీక్షలో ఏలూరు కలెక్టర్, ఎస్పీ హాజరు

image

అమరావతి సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి, శాంతిభద్రతలపై చర్చించారు. ముఖ్యమంత్రి సూచనలను అమలు చేయడానికి సిద్ధమని జిల్లా అధికారులు తెలిపారు.

News September 16, 2025

విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్‌చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.