News April 5, 2025

MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

image

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్‌ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.

Similar News

News April 13, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 13, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు
ఇష: రాత్రి 7.46 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 13, 2025

చిత్తూరులొ 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు 

image

సోమవారం అంబేడ్కర్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 

News April 13, 2025

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన కొట్టాయి ఉత్సవం 

image

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం శనివారంతో ముగిసింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వామి, అమ్మవార్లకు ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రతిరోజు స్వామి, అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకువచ్చి విశేష పూజలు జరిపారు. చివరి రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి, పురవీధులలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు.

error: Content is protected !!