News March 29, 2025
MDCL: స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుక

కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుకగా, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి ఒక్క రూపాయి వడ్డీని తిరిగి చెల్లించే నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను సంబంధిత బ్యాంకుల ఖాతాల్లో జమ చేయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.5.66 కోట్లు చెల్లించి, జిల్లాలోని 3910 స్వయం సహాయక సంఘాలకు గత సంవత్సరం చెల్లించిన వన్ రూపీ వడ్డీ తిరిగి చెల్లించడం జరిగిందని అధికారులు తెలిపారు.
Similar News
News April 2, 2025
నిత్యానంద స్వామి జీవసమాధి? రూ.4 వేల కోట్ల ఆస్తులు ఆమెకేనా?

ఆధ్యాత్మిక గురువు <<15958341>>నిత్యానంద<<>>(47) జీవసమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల సంరక్షణపై చర్చ జరుగుతోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతోపాటు తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు, నటి రంజితకే చెందుతాయని ఆయన శిష్యులు చెబుతున్నట్లు సమాచారం.
News April 2, 2025
ఎల్లారెడ్డి: ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసం

సైబర్ నేరాగాళ్ల వలలో పడి మహిళ మోసపోయిన ఘటన ఎల్లారెడ్డి మండలం రుద్రవరంలో చోటుచేసుకుంది. రుద్రవరం గ్రామానికి చెందిన షేర్ల భావన ఈ నెల 26న ఒక డ్రెస్ ఆర్డర్ చేసింది. అయితే 30వ తేదీ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మహిళను బెదిరించాడు. తాను మోసపోయానని గ్రహించి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె 1930కు ఫోన్ చేయగారూ.16 వేలు హోల్డ్‌లో పడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 2, 2025
హైకోర్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రమాణం చేసిన లావణ్య

లక్ష్మణచాంద మండలం చామన్‌పెల్లి గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ NT లావణ్య తెలంగాణ హైకోర్ట్ అసోసియేషన్ మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధికంగా 1874 ఓట్లు సాధించి సమీప అభ్యర్థిపై 550 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆమెను తోటి న్యాయవాదులు సన్మానించి అభినందనలు తెలిపారు.