News March 24, 2025
MDCL:TARGET..రోడ్ల పై ఎక్కడికక్కడ తనిఖీలు!

మేడ్చల్ జిల్లాలో రవాణాశాఖ అధికారులు టార్గెట్ రీచ్ కావడంపై ఫోకస్ పెట్టారు. MDCL జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా రవాణాశాఖ లక్ష్యం రూ.1,279.58 కోట్లు కాగా.. ఫిబ్రవరి 28 నాటికి కేవలం రూ.1,144.88 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. మార్చి 31నాటికి మేడ్చల్ జిల్లా నుంచి ఇంకా రూ.134.67 కోట్ల ఆదాయం సమకూరితే లక్ష్యం చేరుకుంటుంది.
Similar News
News October 25, 2025
HYD: తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపిక

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈ నెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
News October 25, 2025
హైదరాబాద్ వెదర్ అప్డేట్

నగరంలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.