News January 16, 2026

MDK:‘ఫోన్ పే రూ.5000 Gift’.. జాగ్రత్త !

image

పండుగ బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. “ఫోన్‌పే పొంగల్ గిఫ్ట్” అంటూ రూ.5,000 ఆశ చూపిస్తూ వస్తున్న నకిలీ లింకులపై ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఇలాంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, ఆన్‌లైన్ మోసాల పట్ల అవగాహనతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News April 5, 2026

ఈవీ వాహన లోపం.. ఖమ్మం కోర్టు సంచలన తీర్పు

image

ఎలక్ట్రిక్ వాహన మైలేజీ విషయంలో మోసపోయిన వినియోగదారుడికి ఖమ్మం వినియోగదారుల కమిషన్ ఊరటనిచ్చింది. పాల్వంచకు చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు.. వాహన ధర రూ.54,810తో పాటు మానసిక వేదనకు రూ.75 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్‌ను ఆదేశించింది. బాధితుడికి మొత్తం రూ.1,39,810లు చెల్లించాలని శనివారం వెలువరించిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

News April 5, 2026

ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రముఖ ‘సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుందని తెలిపారు.

News April 5, 2026

ఖమ్మం జిల్లాలో 8న పాడైన చక్కెర వేలం

image

ఖమ్మం జిల్లాలోని గోదాముల్లో నిల్వ ఉన్న, వినియోగానికి పనికిరాని చక్కెరను వేలం వేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈనెల 8న ఖమ్మం అర్బన్, 9న నేలకొండపల్లి, వైరా, 10న ఏన్కూరు, సత్తుపల్లి కేంద్రాల్లో వేలం నిర్వహించనున్నారు. మొత్తం సుమారు 23.84 మెట్రిక్ టన్నుల చక్కెర వేలం వేస్తామని, వేలం దక్కించుకున్న వారే రవాణా ఖర్చులు భరించాలని ఆమె స్పష్టం చేశారు.