News February 2, 2025

MDK: అండర్-19 అమ్మాయిల టీమ్‌కు మంత్రి అభినంద‌న‌లు

image

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన ఇండియా అమ్మాయిల టీమ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (3 వికెట్లు, 44 పరుగులు) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీలో త్రిష అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మంత్రి కోరారు.

Similar News

News December 15, 2025

జిల్లాను ఓటింగ్‌లో టాప్‌లో ఉంచాలి: కలెక్టర్

image

శత శాతం ఓటింగ్‌లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

News December 15, 2025

మెదక్: ‘3వ విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత’

image

మెదక్ జిల్లాలో జరగనున్న మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల భద్రతకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

News December 15, 2025

MDK: ‘లక్ష్యం గట్టిదైతే విజయం బానిస’

image

లక్ష్యం గట్టిదైతే విజయం నీ బానిస అవుతుందని అమెరికాలోని ఫెయిర్ ఫ్యాక్స్ యూనివర్సిటీ డీన్, మోటివేటర్ డా. వీణ కొమ్మిడి అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ‘అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, లక్ష్యాలు, సాధన’ అంశాలపై ఆమె డిగ్రీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ పాల్గొన్నారు.