News February 2, 2025
MDK: అండర్-19 అమ్మాయిల టీమ్‌కు మంత్రి అభినందనలు

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన ఇండియా అమ్మాయిల టీమ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (3 వికెట్లు, 44 పరుగులు) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీలో త్రిష అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మంత్రి కోరారు.
Similar News
News February 9, 2025
మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్‌గా గుండె రాజు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్‌లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.
News February 9, 2025
MDK: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.
News February 9, 2025
మెదక్: 10న జాతీయ నులిపురుగుల నివారణ: డీఈవో

మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలలో ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చూడాలని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే స్థానిక, మండల వైద్యాధికారులు, ఏఎన్ఎంను సంప్రదించాలని సూచించారు.