News August 15, 2024

MDK: అందరికీ రుణమాఫీ కాలేదు: మాజీ MLA

image

రుణమాఫీ అందరికీ కాలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటోందని BRS నేత, నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేటలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవ్వరిని అడిగినా రుణమాఫీ కాలేదనే చెబుతున్నారని, మరి ఎవరికి మాఫీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని, పథకాలు అందించిన BRS కావాలా.. మోసం చేసిన కాంగ్రెస్ కావాలా అని అడిగారు.

Similar News

News November 23, 2025

మెదక్‌లో JOBS.. APPLY NOW

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.

News November 23, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.