News April 2, 2024
MDK: అమ్మాయిని వేధించిన వ్యక్తికి జైలు శిక్ష

మెదక్ జిల్లా హవేలిఘనపూర్కు చెందిన గుండ్లకుంట బాబు(45)కు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పునిచ్చినట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. మండలానికి చెందిన అమ్మాయిని వేధిస్తూ.. ‘నా దగ్గరికి రాకపోతే మీ తల్లిని చంపేస్తా’ అని బెదిరించాడని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించినట్లు చెప్పారు.
Similar News
News December 18, 2025
మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.
News December 18, 2025
చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News December 18, 2025
‘టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి’

STUTS మెదక్ జిల్లా 2026 నూతన సంవత్సర క్యాలండర్ను అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్మా ట్లాడుతూ.. STUTS సంఘ బాధ్యులు పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సహకరించడం అభినందనీయమన్నారు. టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.


