News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరం తండా గ్రామానికి చెందిన కేతావత్ స్వామి అనే వ్యక్తికి ఒక సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అతని తాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో ఖర్చులు, అతని పెళ్లి ఖర్చులతో అప్పు కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 5, 2025

పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

image

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజును దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ కొల్చారం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు.

News December 5, 2025

మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.