News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చెన్నయిపల్లి గ్రామానికి చెందిన చిన్నోళ్ల శ్రీశైలం(23) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శ్రీశైలం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 11, 2025

మెదక్: శవం వద్ద మెడికల్ విద్యార్థుల ప్రమాణం

image

మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్‌కి ముందు వారికి విజ్ఞానాన్ని పంచే శవం వద్ద ప్రమాణం చేశారు. ఎల్లప్పుడు గౌరవాన్ని, విఘ్నతను కలిగి ఉంటామని కృతజ్ఞులమై ఉంటామని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ జయ, అనాటమీ విభాగం డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2025

మెదక్ జిల్లాలో రూ.84,40,52,317 జమ

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. గత రెండు రోజుల కింద ఎకరంలోపు సాగు చేసుకునే రైతులకు వారి అకౌంట్లో జమ చేసింది. సోమవారం రెండు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు విడుదల చేయగా మెదక్ జిల్లాలోని మొత్తం 1,72,349 మంది రైతులకు రూ.84,40,52,317 జమ చేశారు. దీని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

News February 11, 2025

మెదక్: ‘ఇంటర్‌లో 100% ఫలితాలు సాధించాలి’

image

 ఇంటర్‌లో 100% ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. రామాయంపేట జూనియర్ కళాశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం లెక్చరర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి లెక్చరర్ సబ్జెక్టుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!